GO187 AP Teachers Transfers 2022 Telugu Information

GO 187 ఉపాధ్యాయ బదిలీలు విధివిధానాలు ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు సబంధించి బదిలీ విధివిదానాలు జి.ఓ.నె:187 తేది:10/12/2022 విడుదల చేయడం జరిగింది. పాటశాలలలో సరిపడినంత మంది ఉపాధ్యాయులను నియమించడానికి ఈ జి.ఓ 187 మరియు ఉపాధ్యాయుల బదిలీలకోసం తగు ఉత్తర్వులు జారి చేయడం జరిగింది. ఇక్కడ మనం ఉపాధ్యాయుల బదిలీకోసం తగు ముఖ్యమైన సమాచారాన్ని తెలుగులో ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది.

GO 187 ఉపాధ్యాయ బదిలీలు విధివిధానాలు ఆంధ్రప్రదేశ్
GO 187 ఉపాధ్యాయ బదిలీలు విధివిధానాలు ఆంధ్రప్రదేశ్

నెలరోజులలో ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి

ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయంచింది. గురు, శుక్రవారాల్లో వరుసగా సమావే శాలు నిర్వహించిన మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు చివరికి బదిలీలు నిర్వహించా లనే నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 12వ తేదీ లోపు ప్రకటన విడుదల చేసి, నెల రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆన్లైన్లోనే ప్రక్రియ నిర్వహి స్తారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానో పాధ్యాయులు, 8ఏళ్లు ఒకేచోట పని చేస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది. ఎలాంటి సర్వీసు లేకుండానే (జీరో సర్వీసు) బది లీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించను న్నారు. స్పౌజ్, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇతరత్రా సర్వీసు, పాఠశాలల స్టేషన్ పాయింట్లు గతంలోలాగానే ఉంటాయి.

  • Read Also : Go.187 AP Teachers Transfers 2022 Guidelines Click Here

బదిలీ జి.ఓ ముఖ్యాంశాలు

  • గ్రేడ్ -II ప్రధానోపాధ్యాయులకు ఒక పాటశాలలో 5 ఏళ్ళ గరిష్ట పరిమితి, తప్పని సరిగా బదిలీకి గురికాబడుదురు.
  • ఉపాధ్యాయులకు(SGT/SA) ఒక పాటశాలలో 8 ఏళ్ళ గరిష్ట పరిమితి, తప్పని సరిగా బదిలీకి గురికాబడుదురు.
  • డిసెంబర్ 14 నుండి 17 వరకు (4 రో) ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
  • బదిలీ సీనియారిటీ జాబితాలపై డిసెంబర్ 20 నుండి 22 దాకా అభ్యంతరాలు.,..
  • అభ్యంతరాలు డిసెంబర్ 23నుండి 24 వరకు J.C గారి Approval తో పరిష్కరించి Dec 26 న తుది జాబితా సీనియారిటి ప్రకటించాలి.
  • డిసెంబర్ 27 నుండి జనవరి 1 వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి.
  • జనవరి 12 న Transfer orders విడుదలగును.

ముఖ్యమైన తేదీలు

  • ఖాళీల వివరాలు వెబ్ సైట్ లో ప్రదర్శన: 12,13 డిశంబర్
  • బదిలీలకు దరఖాస్తు చేసుకోవడం డిశంబర్ 14 నుండి 17 వరకు
  • బదిలీ దరఖాస్తుల వెరిఫికేషన్ డిశంబర్ 18,19 తేదీలు*
  • సీనియారిటీ లిస్ట్ ల ప్రదర్శన మరియు అభ్యంతరాల అప్ లోడ్ చెయ్యడం డిశంబర్ 20 నుండి 22 వరకు*
  • అన్ని రకాల అబ్జక్షన్లు పరిశీలన, ఫైనల్ చేయ్యడం డిశంబర్ 23,24 తేదీలు
  • ఫైనల్ సీనియారిటీ జాబితాల ప్రదర్శన డిశంబర్ 26
  • వెబ్ ఆప్షన్లు పెట్టుకోడానికి అవకాశం డిశంబర్ 27 నుండి జనవరి 1 వరకు
  • బదిలీ కోరుకున్న వారికి పాఠశాలల కేటాయింపు జనవరి 2 నుండి 10 వరకు
  • కేటాయింపులో ఏమైనా తేడాలు ఉంటే అబ్జక్షన్లు జనవరి 11
  • బదిలీ ఉత్తర్వులు డౌన్ లోడ్ చేసుకోవడం జనవరి 12

ఉపాధ్యాయుల బదిలీలకు ప్రమాణాలు

బదిలీలు అభ్యర్థన ఆధారంగా మరియు అడ్మినిస్ట్రేటివ్ ప్రాతిపదికన మాత్రమే అమలు చేయబడతాయి. ప్రభుత్వం/ZPP/MPPలోని ప్రధానోపాధ్యాయులు (Gr. II)/ఉపాధ్యాయుల కింది వర్గాలు బదిలీ చేయబడతారు.

  1. 2021-2022 విద్యా సంవత్సరం నాటికి 5 విద్యా సంవత్సరాల సర్వీసును పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు (Gr-II) మరియు ఒక నిర్దిష్ట పాఠశాలలో 8 విద్యా సంవత్సరాల సేవను పూర్తి చేసిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ చేయబడతారు (అకడమిక్ ఇయర్‌లో సగానికి పైగా ఈ ప్రయోజనం కోసం పూర్తి సంవత్సరంగా పరిగణించబడుతుంది మరియు సగం కంటే తక్కువ పరిగణించబడదు).
  2. అయితే 31.08.2024న లేదా అంతకు ముందు (2 సంవత్సరాలలోపు) పదవీ విరమణ చేయబోయే వారు అటువంటి బదిలీ కోసం అభ్యర్థించనంత వరకు బదిలీ చేయబడరు.
  3. అభ్యర్థన బదిలీని దరఖాస్తు చేయడానికి కనీస సేవ అవసరం లేదు.

పునర్విభజనపై బదిలీ చేయబడిన ఉపాధ్యాయుల గుర్తింపు ప్రమాణాలు

  • సంబంధిత పాఠశాలలో ఏదైనా పోస్టు ఖాళీగా ఉన్నట్లయితే, ఆ ఖాళీ పోస్టును పునర్విభజన కోసం మిగులుగా గుర్తించాలి. ఈ సందర్భంలో, ఏ ఉపాధ్యాయుడు ప్రభావితం కాదు.
  • ఏదైనా ఉపాధ్యాయుడు, నిర్దిష్ట పాఠశాలలో 8 విద్యా సంవత్సరాల సర్వీసును పూర్తి చేసినట్లయితే, ఒక పోస్ట్ మిగులుగా గుర్తించబడి, బదిలీకి ప్రతిపాదించబడినప్పుడు పునః-విభజన కోసం పరిగణించబడుతుంది (పోస్టుల వర్గం పరిగణించబడుతుంది).
  •  నిర్దిష్ట పాఠశాలలో 8 విద్యాసంవత్సరాలు పూర్తి చేయని ఉపాధ్యాయుడు పాఠశాలలో సీనియర్ ఉపాధ్యాయునిగా ఉండి, పునర్విభజన కిందకు వెళ్లడానికి ఇష్టపడితే, అటువంటి ఉపాధ్యాయుడికి బదిలీకి అవకాశం ఇవ్వబడుతుంది.
  •  (ఎ), (బి) (సి) అందుబాటులో లేని పక్షంలో, కేడర్‌లో అందించిన సర్వీస్ ప్రకారం జూనియర్ మోస్ట్ టీచర్ బదిలీ చేయబడతారు. పాఠశాలల మ్యాపింగ్ కారణంగా మాత్రమే పునర్విభజన జరిగితే మాత్రమే అతనికి/ఆమెకు (05 పాయింట్లు) అందజేయబడతాయి. అటువంటి సందర్భంలో, 2020లో బదిలీలలో బదిలీ అయిన ఉపాధ్యాయుడు అంటే, అతను/ఆమె పాత స్టేషన్ పాయింట్లకు పరిగణించబడతారు.

తప్పనిసరి బదిలీ ఎవరికి

  • ఒకే స్కూల్ లో 2021-22 కు 5 అకాడెమిక్ ఇయర్స్ దాటిన HMs ను 8 అకాడెమిక్ ఇయర్స్ దాటిన ఉపాధ్యాయులను ను , రేషనలైజేషన్ లో మిగులుగా ఉన్న టీచర్లకు నిర్బంధ బదిలీ ఉండును.
  • 31.8.2024 లోగా పదవీ విరమణ చెందిన వారికి వారు కోరుకుంటేలేక రేషన లైజేషన్ లో ఉంటే తప్ప బదిలీ చేయరు.

Read Also : Calculate AP Teachers Transfers Online Points  Click Here

సున్నా సర్వీస్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్

  • నిర్బంధ బదిలీలలో ఉన్నవారి తో పాటు కనిష్ట సర్వీసు తో నిమిత్తము లేకుండా Zero సర్వీసు తో ఎవరైనా బదిలీకు దరఖాస్తు చేసికొనవచ్చును
  • రేషనలైజేషన లో స్కూల్ లో ఖాళి post ను మొదటి ప్రాథాన్యత ల షిఫ్ట్ చేస్తారు.ఆ తర్వాత ఆ కేడర్ లో 8 AY లు నిండిన వారిని మిగులుగా గుర్తిస్తారు. Shifting కు సీనియర్ ఇష్టపడితే కాడర్ సీనియర్ లేక పోతే కాడర్ జూనియర్ ను షిఫ్ట్ చేయబడును.80% కంటే ఎక్కువ అంధత్వము ఉన్న Visually Challenged వారికి షిఫ్ట్ చేయడం నుండి మినహాయింపు ఇవ్వబడినది.
  • గౌరవ హైకోర్ట్ ఆదేశాలు దృష్టి లో ఉంచుకొని మునిసిపల్  మెరజింగ్ వలన Cat III & IV ప్లేస్ లో పనిచేస్తున్న వారికి Old station points ఇస్తారు.
  • 2021 లో తేది 14.10.2021 తో పదోన్నతి పొందిన వారు నిర్బంధ బదిలీకు దరఖాస్తు చేసుకోవాలి.
  • VH వారికి అలాగే 80% పైన OH PH వారికి బదిలీల నుండి మినహాయింపు ఇవ్వబడినది.
  • పేరెంట్ మేనేజ్మెంట్కు బదిలీ కావచ్చును.
  • ఆన్లైన్ ద్వారానే బదిలీ జరపబడును.

పాయింట్ ల కేటాయింపు

  • ప్రతి సర్వీసు Year కు RPS 2015 HRA ప్రకారము Cat I – 1,Cat II-2,Cat III-3,Cat IV-5 పాయింట్లు
  • పెళ్ళికాని స్రీలకు: 5 పాయింట్లు
  • స్పౌజ్ పాయింట్స్  : 5 పాయింట్లు .
  • PH (OH/VH)not less than 40%to 55% -5 పాయింట్లు if More than 56 to 69%. -10 పాయింట్లు
  • స్టేట్ ప్రెసిడెంట్ /జనరల్ సెక్రటరీ యూనియన్:5 పాయింట్లు.
  • మాపింగ్ స్కూల్ వలన రేషనలైజేషన్ లో  పాల్గొనే నాన్  లాంగ్ స్టాండింగ్  ఉపాధ్యాయులకు/HMs కు-5 పాయింట్లు.
  • ఒకే పాయింట్లు వస్తే కాడర్  సీనియారిటీ ప్రకారము సీనియర్ ను నిర్ణయిస్తారు .అది కూడా సమానమైతే DOB, స్రీలకు కు వరుసగా ప్రాధాన్యత ఇస్తారు.
  • Cancer/Open heart surgery/Organ Transplantation /Neuro surgical/Kidney మార్పిడి/డయాలసిస్(6 నెలల ముందటి మెడికల్ రిపోర్ట్ ఆధారంగా)
  • వితంతువులకు
  • న్యాయ బద్దంగా విడిపోయిన స్రీలు పునఃవివాహం చేసుకొని పక్షంలో.
  • Army/Navy/Airforce/BSF/CRPF/CISF లో స్పౌజ్ పనిచేస్తున్న వారికి
  • టీచర్ గా పని చేస్తున్న Ex servicemen

సాధారణం బదిలీ లలో ఇచ్చే పాయింట్స్

  • సాధారణం బదిలీ లలో ఇచ్చే పాయింట్స్ విషయానికి వస్తే
  • Service దృష్ట్యా సం॥ నికి 0.5
  • స్పౌస్ కు 5 పాయింట్ లు
  • స్పేషల్ క్యాటగిరికి 5 పాయింట్లు

స్టేషన్ పాయింట్ లు

  •  కేటగిరి – 1 (16% HRA)-1 points
  • కేటగిరి-2(12% HRA)-2 points
  • కేటగిరి-3(10% HRA)-2 points
  • కేటగిరి-4(10% HRA without connecting road)-5 points
  • 24% HRA తో ఉన్న పాఠశాలలు ఎక్కడా లేవు.

బదిలీలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు

టీచర్స్ ట్రాన్స్పర్ షెడ్యూల్ తేదీలు
వెబ్‌సైట్‌లో ఖాళీల జాబితా ప్రదర్శన 12-12-2022 to 13-12-2022
ఖాళీల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ 13-12-2022
ఖాళీల తుది జాబితా విడుదల 13-12-2022
దరఖాస్తుల స్వీకరణ 14-12-2022 to 17-12-2022
దరఖాస్తుల పరిశీలన 18-12-2022 to 19-12-2022
దరఖాస్తుల్లో సవరణకు చాన్స్‌ 18-12-2022 to 19-12-2022
బదిలీ స్థానం కేటాయింపు మరియు కౌన్సెలింగ్‌ పూర్తి 12-01-2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *